Breaking News

విదేశాలనుంచి పాలన చేస్తున్నట్టుందట..

Chandrababu-Naidu_02

చంద్రబాబుకు హైదరాబాద్ ఉండడం ఇష్టం లేదట.. ఇక్కడుంటే విదేశాలనుంచి పాలన చేస్తున్నట్టు ఉందట.. మనం మన విజయవాడకు వెళ్లిపోవాలని.. ఈ విషయంలో రాజీలేదని చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలతో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాలన సాగించడానికి అధికారులంతా సహకరించాలని..3000 మంది ఉద్యోగుల కోసం గృహవసతి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం చంద్రబాబును కలిసిన ఉద్యోగసంఘాల నేతలు అశోక్ బాబు,మురళీకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులతో ఈ మేరకు అభ్యర్థించారు. వచ్చే జూన్ నాటికి కొన్ని శాఖలను విజయవాడకు తరలిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

గడిచిన బాబు హయాంలో హైదరాబాద్ నుంచి పాలించి హైటెక్ బాబుగా కీర్తించుకున్న బాబులో ఇంత మార్పు ఎలా వచ్చింది అనా ఆరాతీస్తే.. జనం తమ సమస్యలు, పనులు చెప్పుకోవడానికి హైదరాబాద్ రావడం నామోశీగా ఫీలవుతున్నారు. మంత్రులు అధికారులు కూడా ఇలానే భావిస్తున్నారు. సొంత రాష్ట్రం ఉండగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు రావడం ఏంటని ప్రజల ఇబ్బందులు గుర్తించి వారి మనోభావాలు దెబ్బతినకుండా మనం మసులుకోవాలని బాబు ఆలోచించారట.. అందుకే హైదరాబాద్ ను విదేశాలతో పోలుస్తూ ఏపీకి మకాం మర్చాలని డిసైడ్ అయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *