విత్తన, ఆహార ధాన్యాల నిల్వపై నెదర్ల్యాండ్స్ బృందం సహకారం

భారత దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విత్తన, ఆహార ధాన్యాల నిల్వపై నెదర్ల్యాండ్స్ ప్రతినిధి బృందం మన రాష్ట్రానికి సాంకేతిక సహకారాన్నిప్రయోగాత్మకంగా అందించనున్నది. ఈ ప్రతినిధి బృందం ఆదివారం 28.01.2018 నాడు హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర విత్తన  సేంద్రీయ ధృవీకరణ సంస్థ కార్యాలయం సందర్శించినారు. శ్రీ సి. పార్థసారథి, IAS, APC Secretary (A&C) గారిని కలిసిన బృందం తెలంగాణ ప్రభుత్వం అఫ్ఫ్లో టోక్సిన్ సంబంధిత ప్రొజెక్టులపై వారితో పనిచేయటానికి ఆసక్తిగా ఉందని, విత్తన, ఆహార పదార్థాల నిల్వపై సహకారం అందించాలని ప్రతిపాదించగా తమ సంసిద్ధతను వెలిబుచ్చినారు. ఈ సాంకేతిక సహకారం రెండు విషయాలపై కేద్రీకృతం కానున్నది. ఒకటి, పండించిన విత్తనoలోని నాణ్యతను కాపాడుకోవడం. రెండోది, ఆహార గింజలలో Aspergillus అనే శిలీంద్రం ఉత్పత్తిచేసే అఫ్ఫ్లోటోక్సిన్ (Afflotoxin) అనే రసాయనం లేకుండా చేయడం.మన దేశం ఉష్ణ సమశీతోష్ణ మండలంలో ఉన్నమూలంగా నాణ్యమైన విత్తనాన్ని మరియు ఆహార పదార్థాలు ఎక్కువ నిలువ ఉంచి, నాణ్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, గాలిలో తేమ, ఉష్ణం ఎక్కువగా ఉండటంతో విత్తనాలు, ఆహారపదార్థాలు జీవాన్ని త్వరగా కోల్పోతాయి.

పండించిన విత్తనoలోని నాణ్యతను కాపాడుకోవడం చాలా అవసరం. ఎందుకటే, నాణ్యమైన విత్తనాన్ని కాపాడుకొంటే నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసినట్టే. Aspergillus అనే శిలీంద్రం ఉత్పత్తిచేసే అఫ్ఫ్లోటోక్సిన్ (Afflotoxin) అనే రసాయనం మొక్కజొన్న, వేరుశనగ మొదలగు పలు ఆహార గింజలు/ఉత్పత్తులను కలుషితం చేసి మనుషులలో, పశువులలో కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాదులకు కారణమౌతోంది. ఈ సందర్భంగా డాII కే.కేశవులు గారు తాను వివిధ దేశాలలో చేసిన విత్తన నిలువ, నాణ్యత పరిరక్షణ పరిశోధనల గురించి, వివిధ పంటలలో ముఖ్యంగా సోయా చిక్కుడులో 22 నెలల వరకు మొలకశాతం కాపాడే నిల్వ పద్దతుల గురించి, తాను నిర్వహించిన పలు రైతు ప్రదర్శనల గురించి వివరించారు. శ్రీ పార్థసారతి గారు మాట్లాడుతూ విత్తన నాణ్యత, ఆహార ధాన్యాల పరిరక్షణకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొంటుందన్నారు. వనపర్తిలో అఫ్ఫ్లో టోక్సిన్ రహిత వేరుశనగ విత్తన నిల్వకై ప్రణాళికలు సిద్దం చేసినారు. ప్రయోగశాలకై జిల్లా కలెక్టర్ కు బడ్జెట్ నిధులు కూడా మంజూరు చేశామన్నారు.

ఈ విత్తన, ఆహార ధాన్యాల నిల్వ సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రపంచ విత్తన బండాగారంగాఅవతరించనున్న తెలంగాణ రాష్ట్రానికిది మంచి ఊతమివ్వనున్నదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ ప్రతినిధి బృందం సహకారంతో త్వరలో విత్తన Post harvest టెక్నాలజిపై హైదరాబాద్ లో ఓ సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మరియు ప్రతినిధి బృందం మునుముందు పక్కా ప్రణాళికతో పరస్పరం సహకరించుకొంటూ పనిచేయాలని నిర్ణయించామని మిస్ చెరిల్ హ్యారిసన్ తెలిపారు. ఇందులో, విల్లియమ్ ఎస్. పెరెల్ల్, చెరిల్ ఈ. హ్యారిసన్, SRN రెడ్డి; విత్తన ధృవీకరణ సంస్థ అధికారులు జి. సుదర్శన్, డిప్యూటీ డైరెక్టర్; ప్రదీప్, అంతుల్ SCOలు పాల్గొన్నారు.

SRI C PARDHA SARADHI 1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *