Breaking News

విడుద‌ల‌కు సిద్ధ‌మౌతున్న రెండు సందీప్తి చిత్రాలు

విడుద‌ల‌కు సిద్ధ‌మౌతున్న 2 సందీప్తి చిత్రాలు
నాడు రాధా క‌ళ్యాణం..నేడు రాణీవాసం సీరియ‌ల్స్‌
==========================
సినీ,టీవీ సీరియ‌ల్స్‌తో సందీప్తి బిజీబిజీ
  విశిష్ట క‌ళాకారులను సినీ, టీవీ రంగానికి ప‌రిచ‌యం చేసిన క‌ళ‌ల కాణాచి విజ‌య‌న‌గ‌రం  అందించిన మ‌రో ఆణిముత్యం.. అద్భుత క‌ళాకారిణి.. కుమారి సందీప్తి  త‌న ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ప్ర‌జ‌ల‌, ప్రేక్ష‌క  దేవుళ్ల మ‌న్న‌న‌ల‌ను పొందుతున్నారు. తాజాగా సందీప్తి న‌టించిన *బ్రేకింగ్‌న్యూస్‌*. నాగిని చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. క‌ధానాయిక పాత్ర‌లో ఆమె వీక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నారు. ఇటీవ‌ల‌నే ఈ చిత్రాలు ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి, హైద‌రాబాద్ లలో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్నాయి. ఇలా ఉండ‌గా ద‌ర్శ‌క‌ర‌త్న దాసరి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన *యంగ్ ఇండియా* చిత్రంలో సినీ రంగ ప్ర‌వేశం చేసిన సందీప్తి అతి త‌క్కువ కాలంలోనే దాదాపు 40కి పైగా సినిమాల‌లో న‌టించి ఎంద‌రినో మెప్పించారు.  ఇంత‌వ‌ర‌కు యంగ్ ఇండియా, లెజెండ్‌, రేసుగుర్రం, ఐస్‌క్రీమ్‌, దొంగాట‌, రియాలిటీ, ఫ్రూట్ స‌లాడ్‌, భ‌లేమొగుడు-భ‌లేపెళ్లాం, వీరంగం, అనుచ‌రుడు, ద‌గ్గ‌ర‌గా దూరంగా, స‌రదాగా అమ్మాయితో, ద‌శిమి, అయ్యారే, రామదండు,పార్క్‌.,యుద్ధం, శీనుగాడు, ల‌వ్‌జంక్ష‌న్‌, 100/ల‌క్‌, ర‌య్‌ర‌య్‌, ల‌వ్‌డాట్‌కామ్‌, త్రీ ఇడియ‌ట్స్‌,రాజ్‌మ‌హ‌ల్‌, స్విస్‌రాజా. ల‌వ్ ఇన్ మలేసియా, డాల‌ర్‌కు మ‌రోవైపు, ఆ త‌రువాతి క‌ధ‌, న‌ల‌దమ‌యంతి, మ‌ళ్లీ జ‌న్మంటూ ఉంటే, వార‌ధి, చంద్రుడిలో ఉండే కుందేలు, అడ్డా, ఉద‌యం, అలా మొద‌లైంది(త‌మిళ్‌), నేను నేనే రామూనే, త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు.ప్ర‌ధానంగా  మ‌ధుర మీనాక్షి, శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి చరిత్ర చిత్రాల‌లో ప్ర‌ధాన పాత్ర పోషించ‌డం, ర‌మ్య‌కృష్ణ‌, రంగ‌నాధ్‌, సుమ‌న్‌, చంద్ర‌మోహ‌న్‌, ఎవిఎస్‌,బాబూమోహ‌న్‌, ల‌క్ష్మీప్ర‌స‌న్న వంటి హేమాహేమీల‌తో న‌టించ‌డం మ‌ర‌చిపోలేని విష‌యాల‌ని సందీప్తి విన‌మ్రంగా చెప్పారు.
 ఇక టీవీ సీరియ‌ల్స్ విష‌యానికొస్తే..జీ తెలుగులో సంచ‌ల‌నం సృష్టించిన *రాధాక‌ళ్యాణం* సీరియ‌ల్‌లో కీర్తి పాత్ర సందీప్తికి ఎన‌లేని పేరు తెచ్చింది. ఇప్ప‌టికి సందీప్తిని ఎక్క‌డికి వెళ్లినా.. కీర్తి అని గుర్తుప‌ట్టి, పిలిచేవారే ఎక్క‌వ‌. అదేవిధంగా ఈటీవీలో *హృద‌యం*  టీటీడీ ఛానెల్‌లో లోపాముద్ర‌, స‌తీసుక‌న్య‌, ధ‌ర్మ‌చ‌క్రం, జెమినీ టీవీలో అన్వేష‌ణ సీరియ‌ల్‌లోనూ న‌టించారు. ప్ర‌స్తుతం జెమినీ టీవీలో ప్ర‌సారమౌతున్న *రాణీవాసం* సీరియ‌ల్‌లో నాయికగా న‌టిస్తున్నారు.ఈ సీరియ‌ల్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అకట్టుకుంటోంది.కాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఓలేటి అప్పారావు తొలిసారిగా టీవీ సీరియ‌ల్స్‌కు సందీప్తిని ప‌రిచ‌యం చేశారు.  ఇవేగాక ఇంత‌వ‌ర‌కు స్టార్‌మహిళ‌, మోడ్ర‌న్ మ‌హాల‌క్ష్మి, క్యాష్‌, ఆలీ369, భ‌లేఛాన్స్‌లే, రెడీ 321,లక్కీల‌క్ష్మి వంటి దాదాపు 50కి పైగా కార్య‌క్ర‌మాల్లో పాల్గొని అంద‌రికీ చేరువ‌య్యారు.
 ల‌ఘు చిత్రాల్లో ఉత్త‌మ న‌ట‌న‌: ఇంత‌వ‌ర‌కు దాదాపు 25కు పైగా ల‌ఘు చిత్రాల్లో న‌టించిన సందీప్తి తాజాగా న‌టించిన *జ‌గ‌న్ ప్రేమ‌లో ప‌డ్డాడు* యూ ట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేవిధంగా సందీప్తి న‌టించిన తిరుప‌త‌మ్మ క‌ధ‌లు, కోట‌ప్ప‌కొండ‌, రామాసీత‌, మ‌ల్ల‌న్న‌క‌ధ‌,  కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈటీవీ కోసం త‌యారైన ఓ ఆల్బ‌మ్‌లో న‌టించారు. వీటితో పాటు క‌ళ్యాణ్‌, మానేప‌ల్లి జ్యూయిల‌ర్స్‌, సీఎంఆర్‌, రాజీవ్ స్వ‌గృహ, శంకు మార్క్ లుంగీల వంటి వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లోనూ త‌ళుక్కున మెరిశారు.
అవార్డులు:- యంగ్ ఇండియా చిత్రంలో న‌ట‌న‌కు గాను భ‌ర‌త‌ముని అవార్డు, జీ తెలుగు సీరియ‌ల్‌లో  ప్ర‌తిభ‌కు ఉత్త‌మ సోద‌రి అవార్డు, రాధాక‌ళ్యాణం సీరియ‌ల్‌లో న‌ట‌న‌కు  ప‌ద్మ‌మోహ‌న అవార్డు, జీవీఆర్ క‌ల్చ‌ర‌ల్ ఫౌండేష‌న్ అవార్డుల‌ను సందీప్తి అందుకున్నారు. జ‌గద్విఖ్యాతి పొందిన విజ‌య‌న‌గ‌రం మ‌హ‌రాజా సంగీత నృత్య క‌ళాశాల నుంచి కూచిపూడి. భ‌ర‌త‌నాట్యంల‌లో డిప్లొమో పొందిన సందీప్తి ఇంత‌వ‌ర‌కు రాష్ట్ర, రాష్ట్రేత‌ర ప్రాంతాల్లో దాదాపు 650కి పైగా నాట్య‌ప్ర‌ద‌ర్శ‌నలిచ్చి వంద‌లాది బ‌హుమ‌తులు, పుర‌స్కారాలు పొందారు. మలేషియా, సింగ‌పూర్ వంటి దేశాల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చిన సందీప్తిని ముంబైలో ప్రేక్ష‌కుల స‌త్క‌రించి కొనియాడారు. దాదాపు నాలుగేళ్ల ప్రాయం నుంచి  ఏక‌పాత్రాభిన‌యం, మూకాభినయం వంటి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో క‌ళారంగాన్నిముద్దాడిన సందీప్తి నృత్య‌రంగంలో త‌న‌దైన శైలి,కీర్తిని సొంతం చేసుకున్నారు.  అందువ‌ల్లే * లేత‌గులాబి, లిటిల్ రోజ్ ఆఫ్‌విజ‌య‌న‌గ‌రం, ఉగాది పురస్కారాలు, బాల‌మిత్ర అవార్డు, సంక్రాంతి క‌ళా పుర‌స్కారాలు. తిప్ప‌ల ర‌మ‌ణారెడ్డి ఉత్త‌మ క‌ళా పుర‌స్కారంతో పాలు ఒరిస్సాలో ఉత్క‌ళ్ క‌ళా సంస్ధ ప్ర‌తిష్టాత్మ‌క పుర‌స్కారాన్ని దక్కించుకున్నారు. క‌ళారాధ‌నే ఊపిరిగా సాగుతూ దాస‌రి నారాయ‌ణ‌రావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, కోడిరామ‌కృష్ణ‌, రామ‌లింగేశ్వ‌ర‌రావు వంటి పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు అందుకున్న సందీప్తి మ‌రెన్నో ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహిస్తుంద‌నుట‌లో సందేహం లేదు.
సుమన్ తో సందీప్తీ

సుమన్ తో సందీప్తీ

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *