విజయవాడకు మకాం మార్చనున్న లోకేష్

-రేవంత్ అరెస్ట్, తెలంగాణ ప్రభుత్వ నిఘా నేపథ్యంలో నిర్ణయం

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో బుక్కైన రేవంత్ రెడ్డి వ్యవహారంతో టీడీపీ అలెర్ట్ అవుతోంది.. హైదరాబాద్ లో తమకు సేఫ్టీ లేదని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కుమారుడు లోకేష్ తనకు విజయవాడలో మంచి వసతులున్న ఒక ఇల్లు చూడమని ప్రముఖ పారిశ్రామికవేత్తకు సూచించారట.. ఏపీ సీఎం ప్రభుత్వాన్ని నడిపిస్తుండగా.. చిన్నబాబు లోకేష్ పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను ఇంటినుంచే చక్కదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో తనకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించి టీడీపీ కార్యకలాపాలు, విజయవాడకు మార్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ఇక నుంచి హైదరాబాద్ లో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించారట.. అంతేకాదు ఆర్థిక వ్యవహారాలు ఫోన్లో మాట్లాడకూడదని భావిస్తున్నారట.. సో టీడీపీకి రేవంత్ దొరికిపోవడం ఆ తర్వాత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ ను విడిచి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *