విజయనగరంలో బంద్ ప్ర‌శాంతం: విజ‌య‌వంతం

ఏపీయూడ‌బ్ల్యూజే జ‌ర్న‌లిస్టుల రాస్తారోకో: 20 మంది సీపీఐ కార్య‌క‌ర్త‌లు అరెస్టు

విజ‌య‌న‌గ‌రం ఆగ‌స్టు 11 :- ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌ని కోరుతూ 11వ తేదీ మంగ‌ళ‌వారం త‌ల‌పెట్టిన బంద్ విజ‌య‌వంత‌మైంది. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు లేకుండా సంపూర్ణంగా సాగింది. వామ‌ప‌క్షాలు వివిధ ప్ర‌జా సంఘాలు త‌ల‌పెట్టిన బంద్‌కు తాజాగా కాంగ్రెస్ పార్టీ, వైసీపీతో పాటు, వివిధ మ‌హిళా సంఘాలు, ఎఐటియుసి వంటి కార్మిక సంఘాలు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ యూనియ‌న్ ఆఫ్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్స్ (ఎపీయూడ‌బ్ల్యూజే) వంటి పాత్రికేయ‌సంఘాలు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించాయి. ఇప్ప‌టికే బంద్‌పై విస్తృత ప్ర‌చారం సాగినందున, పైగా మంగ‌ళ‌వారం విజ‌య‌న‌గ‌రం మార్కెట్ సెల‌వుదినమైనందున బంధ్ సంపూర్ణంగా విజ‌య‌వంతమైంది.. బంద్ దృష్ట్యా పోలీసులు కూడా బందోబ‌స్తు పెంచారు. సీపీఐ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు ఉద‌యం ఆర్టీసీ బ‌స్సులు ఆర్టీసీ డిపో వ‌ద్ద బైఠాయించ‌డంతో బ‌స్స‌లు డిపోదాటి బ‌య‌ట‌కు రాలేదు. ఈసంద‌ర్భంగా దాదాపు 20 మంది సీపీఐ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా బంద్ దృష్ట్యా పాఠ‌శాల‌లు, బ్యాంకులు, వివిధ వాణిజ్య సంస్ధ‌లు మూత‌ప‌డ్డాయి. ఎపీయూడ‌బ్ల్యూజే, విజ‌య‌న‌గ‌రం ప్రెస్‌క్ల‌బ్ త‌ర‌పున స్ధానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వ‌ద్ద రాస్తారోకో జ‌రిగింది. వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం వాటిల్లింది. సంఘ నాయ‌కులు శివ‌ప్ర‌సాద్‌, మ‌హాపాత్రో, శేష‌గిరి, గురుప్ర‌సాద్‌, టి. రాధాకృష్ణ‌, ఎస్పీరాజు, కోటేశ్వ‌ర‌రావు శంక‌రావు, వైఎస్ పంతులు, సీతారాం, చ‌ల‌ప‌తిరావు త‌దిత‌రులు కార్య‌క్ర‌మానికి నాయ‌క‌త్వం వ‌హించారు, ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ధ‌ర్నా నిర్వ‌హించి అధికారుల‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.