వికార్ ఎన్ కౌంటర్ రజనీకాంత్ సినిమాలా ఉంది..

హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో జరిగిన వికారొద్దీన్ ఎన్ కౌంటర్ తీరు అచ్చం రజనీకాంత్ సినిమాలా ఉందని మండిపడ్డారు ఎంపీ అసదొద్దీన్. గురువారం అసదుద్దీన్ నేతృత్వంలో ముస్లిం నేతలు సీఎం కేసీఆర్ తో భేటి అయ్యారు. ఈ ఎన్ కౌంటర్ పై విచారణ జరిపించాలని నేతలు కోరారు. అనంతరం అసద్ మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదులకు చేతులకు సంకెళ్లు ఉండగా పోలీసుల నుంచి రైఫిళ్లు ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు. ఎన్ కౌంటర్ పోలీసులు చేసిందేనని.. ఇలాంటివి రజనీకాంత్ సినిమాల్లో మాత్రమే సాధ్యమని మండిపడ్డారు. హైకోర్టు జడ్జి, సీబీఐతో విచారణ జరపాలని సీఎంను కోరారు. సీఎం కేసీఆర్ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *