వికలాంగ కవియిత్రికి నెలకు పదివేల సాయం

sirisicilla

కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లకు చెందిన వికలాంగ కవయిత్రి బి.రాజేశ్వరీకి నెలకు 10,000/- రూపాయల చొప్పున పెన్షన్‌ అందే విధంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. రాజేశ్వరీకి సుద్దాల హనుమంతు పురస్కారం అందజేసిన సందర్బంగా చేనేత కార్మిక కుటుంబానికి చెందిన రాజేశ్వరీని ఆదుకుంటామని ప్రభుత్వం తరపున హామి లభించింది. రాజేశ్వరీ 1999 నుండి దాదాపు 350 కవితలను కాళ్లనే చేతులుగా మలుచుకుని రాశారు. సిరిసిల్ల రాజేశ్వరీ కవితలు పేరుతో ఓ పుస్తకం కూడా వెలువడింది. అంగవైకల్యాన్ని లెక్కచేయకుండా సాహితీ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళగా రాజేశ్వరీని గుర్తించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. రూ. 10 లక్షలను బ్యాంకులో డిపాజిట్‌ చేయడం ద్వారా వచ్చిన వడ్డీ సొమ్మును ఆమె జీవనం కోసం వెచ్చించాలని అధికారులను ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *