వాషింగ్టన్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ — డబ్ల్యూఏటిజి  అధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు వాషింగ్టన్ లో ఘనంగా జరుపుకుంటున్నారు . సీయాటేల్ నగరం లో తెలుగు వారు శనివారం బతుకమ్మ ఆడారు. డబ్ల్యూఏటిజి బోతల్ హై స్కూల్ లో నిర్వహించిన  ఈకార్యక్రమానికి వరంగల్ కార్పొరేషన్ మాజీ మేయర్ శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ ముఖ్య అతిధి గా హజరయ్యారు. సీయాటేల్ ప్రాంతానికి చెందిన దాదాపు నాలుగు వందలమంది తెలుగు మహిళలు ఈ కార్యాక్రమాంలో పాల్గొన్నారు. ఆడపడుచులు అందమైన పూల తో బతుకమ్మలు పేర్చి సాంప్రదాయ పాటలతో ఆడి పాడారు. ప్రముఖ యాంకర్ అశ్విని  తన హుషారైన ఆట పాటలతో అందరినీ అలరించింది .

ఈ సందర్భంగా  ముఖ్య అతిధి  ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ విదేశాలలో ఉండి కూడా బతుకమ్మ పండుగను సంప్రదాయంగా జరుపుకుంటున్న తెలుగు వారిని అభినంధించారు . తెలంగాణా స్ఫూర్తి, సంప్రదాయాలకు మూలం బతుకమ్మ అని కొనియాడారు .

 ఎర్రబెల్లి స్వర్ణ  తెలంగాణా ప్రాంతం లో చేసిన సేవలకి గుర్తింపుగా సంస్థ తరఫున వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డు సభ్యులు ఎర్రబెల్లి స్వర్ణ ను మొమెంటోతో సత్కరించారు. ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ సిటుఎస్  అద్యక్షులు జగన్ చిట్టిప్రోలు  చేతులమీదుగా మొమెంటో అందచేశారు . బతుకమ్మ ప్రాచుర్యానికి , తెలంగాణా ప్రాంతంలో బతుకమ్మ విగ్రహాల స్తాపనకు ఆద్యక్షులుగా నిలిచిన ఎర్రబెల్లి స్వర్ణ ను సంస్థ సభ్యులు కొనియాడరు.

ప్రతి ఏడాది సామాజిక సేవ చేసే తెలంగాణా మహిళల కు ‘ఉమెన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ను వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ సంస్థ అంధజేస్తుంది. 2017 సంవత్సరానికి గాను ఈ అవార్డ్ కు శ్రావణి  ఎంపికయ్యారు. ఎర్రబెల్లి స్వర్ణ  చేతుల మీదుగా ఈ అవార్డు ను సంస్థ వారు శ్రావణి  కి అంధజేశారు.

ఎంతో ఆహ్లాద వాతావరణం లో జరిగిన ఈ వేడుకలో అందమైన బతుకమ్మలు, సాంప్రదాయ చీరల పోటీ నిర్వహించి , విజేతలకు పట్టు చీరలు బహుమతి గా ఇచ్చారు. సాంప్రదాయ పండుగ భోజనం, దాండియా, డిజె లతో సాయత్రానికి పిల్లలు, పెద్దలు ఆనదం గా గడిపారు.

వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ బోర్డు సభ్యులు దునుకునాల మహేశ్, రాజ్ మందాడి, సంగీత బొర్రా, మిథున్ కరమ్, సూర్య వూడెమ్, కృష్ణ చింతకింధి, శ్రీధర్ కుకునూర్, శ్రీధర్ తాడూరి, సంధ్య ఉడుముల, సాయీ పికె మరియు సంస్థ వాలెంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

watg batukamma1     watg batukamma2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *