
స్టాక్ హోం అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ సంచలన విషయాన్ని బయటపెట్టింది. యుద్ధం గనుక వస్తే పాకిస్తాన్ చేతిలో భారత్ కు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఎందుకంటే ప్రస్తుతం నిల్వల ప్రకారం భారత్ కంటే పాకిస్తాన్ లోనే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది.
మనం దేశంతో పోల్చితే పాకిస్తాన్ లోనే ఎక్కువ బాంబులున్నాయట.. భారత్ లో సగటున 100-120 అణ్వాయుధాలుంటే.. అదే పాకిస్తాన్ లో ఆ సంఖ్య 110-130 వరకు ఉన్నట్టు స్టాక్ హోం సంస్థ లెక్కతేల్చింది. ఒక వేళ యుద్ధం వస్తే అపార అణ్వాయుధాలున్న పాకిస్తాన్ చేతిలో భారత్ కు భారీ నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. ఇక అగ్రరాజ్యలైన అమెరికా, రష్యాలు మాత్రం క్రమంగా తమ అణ్వాయుధాలు తగ్గించుకుంటున్నాయని సంస్థ పేర్కొంది.