Breaking News

వాళ్లిద్దరిదీ ఒకే ఫ్లాష్ బ్యాక్

modi-obama-02

-ముగిసిన ఒబామా ఇండియా టూర్
ఢిల్లీ, ప్రతినిధి : ఒబామా, నరేంద్ర మోడీ ఇద్దరిదీ ఒకే ఫ్లాష్ బ్యాక్. ఒక వంటవాడి మనవడు అమెరికా అధ్యక్షుడైతే.. ఒక టీ అమ్మే వ్యక్తి కొడుకు భారత ప్రధాని అయ్యాడు. ఇద్దరూ మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చారు. ఇద్దరిదీ ఒకటే బాట.. అభివృద్ధి నోట.. తమ దేశ భవితను మార్చేందుకు నడుం కట్టారు..

ఇండియా.. 120 కోట్ల జనాభా ఉండి మంచి మార్కెట్ కలిగి ఉంది. కానీ ఉత్పాదక, పెట్టుబడి లేదు.. అదే అమెరికా వద్ద నైపుణ్యం, పెట్టుబడి ఉంది. ఈ రెండే అమెరికా, ఇండియా స్నేహానికి.. వ్యాపారానికి ముడిపెట్టింది. వాటిని మోడీ, ఒబామా చక్కగా ఉపయోగించుకున్నారు. దీంతో పెట్టుబడుల ప్రవాహం మొదలై ఇండియా, అమెరికాలకు మేలు చేసింది.

ఒబామా మూడు రోజుల పర్యటన ముగిసింది. అనేక జ్ఞాపకాలను అమెరికా అధ్యక్షుడికి అందించింది. ఇరు దేశాలను దగ్గరకు చేర్చింది. పెట్టుబడులతో తలుపులు బార్లా తెరిచాయి. మోడీ చతురత ప్రపంచానికి చాటిచెప్పింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *