వార్న్ చేతిలో చిత్తయిన సచిన్ టెండూల్కర్

sachin

అమెరికాలో క్రికెట్ పై క్రేజ్ పెంచడానికి చేస్తున్న ప్రయత్నం హిట్ అయ్యింది..ఐసీసీ ఆధ్వర్యంలో ప్రపంచంలోని అన్నిదేశాల దిగ్గజ క్రికెటర్లను రెండు జట్లుగా కేటాయించి అమెరికా ప్రజలకు టీ ట్వంటీ మాజాను అందించారు.

ఆల్ స్టార్స్ టీ20 క్రికెట్ సిరీస్ వార్న్ నేతృత్వంలోని జట్టు సచిన్ జట్టు పై విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. టీ20 మొదటి మ్యాచ్ లో వార్న్ సేన విజయం సాధించగా ఈరోజు రెండో టీ20 జరిగింది. అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన ఈ పోటీలో మొదట వార్న్ జట్టు బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 262 భారీ సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సచిన్ టీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 205 పరుగులు మాత్రమే చేసి 57 పరుగుల తేడాతో ఓడిపోయింది.. దీంతో సిరీస్ 2-0తో వార్న్ టీం విజయం సాధించింది.

కాగా మొదటిసారి అమెరికాలో నిర్వహించిన ఈ క్రికెట్ కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. భారీగా స్టేడియానికి హాజరై తమ అభిమాన క్రీడాకారులకు మద్దతు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *