
భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో మొదలైంది. కంగాగూరులు బ్యాటింగ్ చేస్తున్నారు, భారత్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఏమాత్రం ఇబ్బంది పడని ఓపెనర్లు కూల్ గా ఆడుతున్నారు వార్నర్ 45 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. మరోవైపు రోజర్స్ 40 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ పూర్తి స్థాయి కెప్టెన్ గా జట్టును నడుపుతున్న తొలి మ్యాచ్ ఇదే. కాబట్టి తన కెప్టెన్సీ నైపుణ్యాన్ని చాటాలని కోహ్లీ ఆరాట పడుతున్నాడు. చివరి టెస్టులో అయినా విజయం సాధించి, ఉత్తి చేతులతో తిరిగి రాకుండా ఏదో ఒకటి సాధించారని అనిపించుకోవాలనేది టీమిండియా సభ్యుల అభిలాష.