
కరీంనగర్ , ప్రతినిధి : వార్డు మెంబర్లకు సైతం సర్పంచ్ ఎంపీటీసీల వలే గౌరవ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వార్డు మెంబర్ల వ్యవస్థాపక అధ్యక్షులు మహంకాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని టీఆర్ఎస్ భవన్ ఎదుట దాదాపు 200 మంది వార్డు మెంబర్లు నిరసన వ్యక్తం చేశారు. అక్కడకు వచ్చిన కడియం శ్రీహరి, కేటీఆర్ లను వార్డు మెంబర్లు అడ్డుకొనగా .. జీతాలు ఇచ్చేందుకు వార్డు మెంబర్ల ఫోరం తో త్వరలోనే మీటింగ్ పెడతామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర అద్యక్షులు బండారి మల్లేషం, ప్రధాన కార్యదర్వి సుమన్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఈదునూరి జాన్, జిల్లా ఉపాధ్యక్షులు నర్సయ్య, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.