Breaking News

వారికి రోగమొస్తే మంచమే అంబులెన్స్

girijanam1

హైదరాబాద్, ప్రతినిధి : పక్కనున్న ఫోటో చూస్తే ఏమనిపిస్తోంది. ఎవరో కొంతమంది ఒక మంచంపై ఎవరినో మొసుకొస్తున్నట్టు లేదూ.. అడవుల్లో ఏదో శవయాత్ర జరుగుతున్నట్టు అనిపిస్తోంది కదూ.. కానీ అది నిజం కాదు.. ఇక్కడ గిరిజనం గోస కనపడుతోంది. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు గడిచినా సరైన రోడ్డు సౌకర్యం లేని గిరిపుత్రల దీనగాథ వినిపిస్తోంది. కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధులు స్వాహా పర్వంలో ఆదిలాబాద్ లో కనీస వసతులు కల్పించని వైనం వెలుగుచూస్తోంది.

Photo1250

అసలు విషయం ఏంటంటే… ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం గుండాల గిరిజన గ్రామం దట్టమైన అటవీ ప్రాతంలో ఉంటుంది. ఆ ఊళ్లోని సోయం చిన్ను(60) అనే వృద్ధుడికి రెండురోజులుగా మూత్రం బంద్ అయి అవస్థలు పడుతున్నారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించాలనుకున్నారు. కానీ చుట్టూ కొండలు కనీసం రోడ్డు, రవాణా సౌకర్యాలుండవు.. ఎటు వెళ్లాలన్నా 15 కి.మీ ల దట్టమైన అటవీ ప్రాంతం దాటి పోవాలి. 15 కి.మీలు అడవులు, గుట్టల గుండా వెళితే ఒక చిన్న గ్రామం దండేపల్లి మండలం మామిడిపల్లి వస్తుంది. అక్కడున్న ఓ ఆటోలో సమీపంలోని 10 కి.మీలో దూరంలో గల మ్యాదరపల్లిలో ఆస్పత్రికి వెళ్లాలి. దీంతో చేసేదేం లేక చిన్ను కుటుంబ సభ్యులు వృద్ధుడిని మంచంపై పడుకోబెట్టి ఇలా 15 కి.మీలు దాటి అడవులు గుండా ప్రయాణించారు. ఇంత అభివృద్ధి , కోట్ల కోట్లు వెచ్చిస్తున్నా.. కనీసం గిరిజన గూడాలకు రోడ్డు సౌకర్యం కల్పించని మన ప్రజాప్రతినిధులను ఏమనాలి.

Photo1251

సీఎం కేసీఆర్ ఎన్నికలకు ముందు ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ఓ హామీ ఇచ్చారు. గిరిజన గూడాల్లో రహదారులు లేని గిరిజన గ్రామాలకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రెండు హెలికాప్టర్ అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తానని.. వాటి ద్వారా గిరిజనులు అనారోగ్యానికి గురి అయితే హెలికాప్టర్ ల ద్వారా తరలిస్తామని.. కానీ ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. రాజకీయ నాయకులు పదవులు అనుభవిస్తున్నారు కానీ గిరిజనుల కష్టాలు మాత్రం తీర్చడం లేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *