Breaking News

వాయిస్ కాలింగ్ సౌకర్యంతో వాట్సాప్?

హైదరాబాద్, ప్రతినిధి : వాట్సాప్.. ఫేస్ బుక్ తర్వాత అతి తొందరగా జనాలకు దగ్గరైన సోషల్ కనెక్టింగ్ మీడియా.. ఈ వాట్పాప్ లో ఇఫ్పుడిస్తున్న మెసేజింగ్ సర్వీస్ బాగా హిట్ అయ్యింది. తమ ఫోటోలు, వీడియోలు.. మెసేజ్ లను విస్తృతంగా తమవారితో పంచుకునే వీలు ఇందులో ఉంటుంది. కాగా దీనికి అదనంగా మరో సౌకర్యాన్ని కల్పించడానికి వాట్సాప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే వాయిస్ కాలింగ్ ప్రీగా అందించేందుకు ప్రయత్నిస్తోందట..

ప్రస్తుతం నెక్సస్ 5 మొబైల్ లో ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటిగ్ సిస్టంపై ఈ ఫీచర్ పనిచేస్తోందని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రొమోలు లో ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి.. అయితే ఈ విషయంపై వాట్సాప్ సంస్థ అధికారికంగా స్పదించలేదు. కానీ సెలెక్టడ్ యూజర్స్ పై వాయిస్ కాలింగ్ ప్రయోగాలు మాత్రం జరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రయోగాల అనంతరం దాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయట..

కానీ ఈ వాయిస్ కాలింగ్ సిస్టమ్స్ పై టెలికామ్ కంపెనీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టం చేకూర్చే ఈలాంటి వాయిస్ కాలింగ్ ను అనుమతిచ్చే ప్రశ్నే లేదని తేల్చిచెబుతున్నారు. దాన్ని తీసుకురావద్దని కోరుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *