Breaking News

వామపక్షాల బంద్ కు కాంగ్రెస్ మద్దతు: కటకం మృత్యుంజయం

KATAKAM

కరీంనగర్ జులై16 : మున్సిపల్ కార్మికుల సంఘీభావంగా వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపునకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని కరీంనగర్ జిల్లా కాంగ్రేస్ కమిటి అద్యక్షులు కటకం మృత్యుంజయం తెలిపారు. కరీంనగర్ లో గురువారం నాడు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అన్ని స్దాయిలలో గల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమ్మెను విజయవంతం చేయడానికి , పారిశుద్ద్య సిబ్బందితో పాటు ఇతర రాజకీయ పార్టీలతో కలిసి క్షేత్ర స్దాయిలో బంద్ లో పాల్గొనాలని ఆయన కోరారు.ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు మృత్యుంజయం తెలిపారు. సమ్మే ప్రారంబించి రోజులు గడుస్తున్నా పారిశుద్ద్య కార్మికులు కోరుతున్న కనీస వేతనాల క్రమబద్దికరణకు కృషి చేయవలసిన ప్రభుత్వం, కార్మికులను రెచ్చగొట్టె విధంగా ప్రవర్తించడమే కాకుండా, ఈ సమ్మెకు మద్దతునిస్తున్న రాజకీయ పార్టీలను సైతం పోలీసు బలగాలనూ మొహరించి నిర్భందించడం, శాంతియుత ఆందోళనను ధ్వంసం చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇందుకు నిరసనగా, రాష్ట్ర వ్యాప్త పారిశుద్ద్య కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతుందన్నారు.వామపక్షాలు ఇచ్చిన ”తెలంగాణ రాష్ట్ర బంద్” పిలుపునకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని, స్వచ్చందంగా బంద్ పాటించాలని వ్యాపార, వాణిజ్య వర్గాలను మృత్యుంజయం కొరారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *