వానొచ్చే.. వరదొచ్చే..

తెలంగాణ ఉప్పొగింది.. భారీ వర్షాలతో చెరువులు కళకళలాడుతున్నాయి. అదే సమయంలో భారీ వరదతో చెరువులు, కాలువలకు గండ్లు పడి కడగండ్లు మిగులుస్తున్నాయి. భద్రాద్రి వద్ద గోదావరి ఉదృతి పెరిగింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి.

ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, ఒడిషాలోని పూరీ, గోపాల్ పూర్ మధ్య ఆదివారం తీరం దాటనుంది. దీని ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *