
వాన కోసం రైతులు, జనాలు మొహం వాచినట్టు ఎదురుచూస్తున్న వేళ వరుణుడు కరుణించాడు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాలపై వరుణుడి కరుణ చూపుతున్నాడు. విస్తారంగా వానలు పడుతున్నాయి.
వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఓడిషా తీరాలను ఆనుకొని మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంగా మంగళవారం తెలంగాణ, ఏపీలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రానున్న రెండు రోజులు వానలు ఇలానే కురుస్తాయని వాతావరణ విబాగం తెలిపింది.