వానలు పడుతున్నాయి.. కానీ..

వానలు వింతగా పడుతున్నాయి.. ముసురు తెలుగు రాష్ట్రాలను కమ్మేసింది. ఇప్పటివరకు భారీ వర్షాలు తెలంగాణలో మూడు జిల్లాల్లోనే కురిసాయి. ఆదిలాబాద్ , ఖమ్మం, వరంగల్ లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి వాగులు, వంకలు పొంగి పొర్లి చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఇక మిగిలిన తెలంగాణ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురువలేదు. అయా జిల్లాల్లో చెరువులు కుంటలు నిండనే లేదు. కరీంనగర్ జిల్లాలో పొడి వాతావరణమే నెలకొంది.

కాగా బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనానికి తోడు రుతుపవనాలు కూడా తోడవడంతో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. కానీ కొన్ని జల్లాలలోనే పడుతూ మిగతా జిల్లాల్లో కేవలం ముసురుతో మురిపిస్తున్నాయి . దీని కారణంగా భూగర్భ జలాలు పెరగక, చెరువులు నిండక జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *