
ఈసారి వానలు ఆలస్యమవుతాయట.. దేశంలోకి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు 6 రోజులు ఆలస్యంగా వస్తున్నాయని వాతావరణ శాఖ నివేదికలిచ్చింది.. జూన్ 7న కేరళను తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనాలు వేసింది.. ఇన్నాళ్లు జూన్ 1న వస్తాయని అంచానా వేశారు. కానీ వారం ఆలస్యంగా జూన్ 7న కేరళ తీరాన్ని తాకనున్నట్టు ఐఎండీ అధికారులు ఆదివారం స్పష్టం చేశారు.
కాగా ఈసారి వానలపై కోటి ఆశలతో జనం ఎదురుచూస్తున్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో వరుసగా రెండు సంవత్సరాలుగా వానలు కురువక దేశం మొత్తం దుర్భిక్షం తాండవిస్తోంది. దీంతో ఈసారి ఎల్ నినో ఎఫెక్ట్ పోయి మంచి వానలు కురుస్తాయని శాస్ర్తవేత్తలు ప్రకటించారు. వారం ముందే వస్తాయని అంచనా వేశారు.. కానీ ఇప్పుడు మరోసారి దాన్ని సవరించారు. జూన్ 7న కేరళ తీరాన్ని తాకితే.. తెలుగురాష్ట్రాల్లోకి రావడానికి 5 లేదా 6 రోజులు పట్టే అవకాశం ఉంటుంది.
కాగా నైరుతి బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికారణంగా రుతుపవనాలు మరింత బలపడే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే మనకు త్వరగా వానలు పడ్డట్టే..