వాడి వేడిగా ఏపీ శాసనసభ సమావేశాలు

హైదరాబాద్: ఆందోళనలతో వాయిదా అనంతరం తిరిగి సమావేశం అయిన ఏపీ శాసనసభలో స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. హుదుద్ తుపాను బాధితులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులు వంది అంశాలపై చర్చ కొనసాగుతుంది.

గిరిజన ప్రాంతాల్లో సాయం ఏది:ఈశ్వరి
గిరిజన ప్రాంతాల్లో హుదూద్ బాధితులకు సాయం అందలేదని వైసిపిఎమ్మెల్యే ఈశ్వరి ప్రభుత్వానికి తెలిపారు. పాడేరు నియోజకవర్గంలో హుదుద్ విపత్తులో చనిపోయిన వ్యక్తులను ప్రభుత్వం ఇంత వరకు గుర్తించలేదని ఆమె ఆరోపించారు. హుదుద్ బాధితులకు ప్రభుత్వం ఖర్చు పెట్టామని చెపుతున్న లెక్కల్లో ఒక్క శాతం కూడా బాధితులకు అందలేదని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటి ఓ బూటకపు కమిటి:జగన్
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం వేసిన కమిటి ఓ బూటకపు కమిటి అని ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీనిపై మంత్రి రావెల కిశోర్‌ స్పందిస్తూ,..ప్రతిపక్ష సభ్యులు కమిటిపై నిజానిజాలు తెలుసుకొని మాట్లాడలన్నారు.

వైఎస్‌ ప్రభుత్వ హయాంలో ఉన్న కమిటీల్లో వారి సభ్యులే ఉండేవారు: అచ్చెన్నాయుడు
గత వైఎస్‌ ప్రభుత్వం హయాంలో ఏ కమిటీ వేసినా,..దాంట్లో ఆపార్టీ సభ్యులే ఉండేవారని మంత్రి అచ్చెనాయుడు ప్రతిపక్షంపై విమర్శలు చేశారు. కానీ,..ప్రస్తుతం ప్రభుత్వం మాత్రం ఏ కమిటీ వేసినా దాంట్లో అన్నిపార్టీలకు చెందిన సభ్యులను పెడుతున్నామన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ప్రతిపక్షం ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం పద్దతి కాదన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.