Breaking News

వాట్సాప్ ఇక కంప్యూటర్లలో..

apertura-whatsapp-web1

ముంబై, ప్రతినిధి :  వాట్సాప్ మెసెంజర్.. స్మార్ట్ ఫోన్లకే పరిమితమైంది. పాత నోకియా ఫోన్లు.. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ మెసెంజర్ వాడడం కష్టం.. కనీసం డెస్క్ టాప్, లాప్ టాప్ కంప్యూటర్ల కు వ్యాట్సప్ యూజ్ చేయడం కష్టమే.. కానీ ఇప్పుడా సమస్యను వాట్స్ ఆప్ తీర్చింది. ఇన్ని రోజులు ఫోన్లలో పంపుకున్న మెసేజ్ లు, వీడియోలు.. వాయిస్ లు ఇకపై డెస్క్ టాప్ లలో కూడా పంపుకోవచ్చు. తొలిసారి వెబ్ బ్రౌజర్లలో వాట్సాప్ ను ఆవిష్కరించింది కంపెనీ.

ఇన్ని రోజులో ఆండ్రాయిడ్, యాపిల్, విండోస్, బ్లాక్ బెర్రీ ఆపరేటింగ్ ఫోన్లలోనే వ్యాట్సాప్ వాడుకొనే వాళ్లు ఇకపై లాప్ టాప్, డెస్క్ టాప్ లలో వాడుకునేందుకు వీలవుతోంది. దీనికోసం ముందుగా బ్రౌజర్ లో wep.whatsapp.com అని టైప్ చేయాలి.  అందులోకి వెళ్లకుముందు ఫోన్లో ఉన్న ప్రజెంట్ వ్యాట్సాఫ్ ను అప్ డేట్ చేసుకోవాలి. దాని తర్వాత కంప్యూటర్ లో క్యూఆర్ కోడ్ ను ఫోన్ తో స్కాన్ చేస్తే ఫోన్లో కాంటాక్ట్ లు అన్నీ వెబ్ లో ప్రత్యక్షమవుతాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *