వాటర్ గ్రిడ్ పథకాన్ని అభినందించిన కేంద్రం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందించింది. తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న మంచినీటి సరఫరా పథకాన్ని మిగతా రాష్ట్రాలు కూడా అధ్యయనం చేయాలని కేంద్రం కోరింది. కేంద్రం కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్డబ్ల్యుఎస్ అధికారులు వాటర్ గ్రిడ్ కార్యక్రమ వివరాలను ఇతర రాష్ట్రాలకు పంపింది. ఇటీవల దిల్లీలో జరిగిన జాతీయ గ్రామీణ మంచినీటి కార్యక్రమం వార్షిక ప్రణాళిక సమావేశంలో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ స్కీం పై చర్చ జరిగింది. దీనికి సంబంధించి కేంద్రం ఓ నోటును తయారు చేసింది. ఈ నోటును అన్ని రాష్ట్రాలకు కేంద్రం పంపింది. ఆ నోట్లో ఇలా పేర్కొన్నారు. ” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచినీటి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. బడ్జెట్లో కూడా 2000 కోట్లు కేటాయించింది. వివిధ ఆర్థిక సంస్థల నుండి ఆర్థిక సహాయం కూడా పొందుతున్నది. ఈ ప్రయత్నాలు అభినందనీయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ నమూనా ఆచరణాత్మకంగా ఉంది. కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలించాలి” అని పేర్కొన్నారు.

కాగా గత కొద్ది నెలలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతిరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అధికారులు, ఆర్డబ్ల్యుఎస్ అధికారులు ఎంతో కష్టపడి వాటర్ గ్రిడ్కు రూపకల్పన చేశారని, ఇప్పుడు వారు రూపొందించిన పథకం ఇతరులకు ఆదర్శంగా నిలవడం సంతోషకరమని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. వాటర్ గ్రిడ్కు సంబంధించిన ఇంటేక్ వెల్స్, పైపులైన్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా సకాలంలో నిర్మించి ప్రాజెక్టును విజయవంతం చేయాలని, ఇతర రాష్ట్రాలకు మార్గ నిర్దేశం చేయాలని సిఎం సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *