వాటర్ గ్రిడ్ ను మాకు ఇవ్వండి..

తెలంగాణలోని పల్లెపల్లెకు ఇంటింటికి తాగు, సాగునీరందించే బృహత్తర వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు నమూనా ఎలా అమలు చేస్తున్నారో మాకు తెలియజేయండని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ మంత్రి కేటీఆర్ కు మంగళవారం ఫోన్ చేసి అడిగారు. ఎంతో గొప్ప ఆలోచన ఇదీ అని.. అధికారం చేపట్టిన ఏడాదిలోనే దీన్ని అమలు చేయడం అద్భుతం అని కేటీఆర్ ను అఖిలేష్ పొగిడారు.

ఇంతటి మంచి పథకాన్ని మాకు తెలియజేయండని. ఉత్తరప్రదేశ్ కు కేటీఆర్ తో పాటు తెలంగాణ ఇంజినీర్లు వచ్చి వివరించాలని ఆహ్వానిస్తున్నామని కేటీఆర్ కు అఖిలేష్ చెప్పారు.

కాగా ముందు తెలంగాణలో పర్యటించి వాటర్ గ్రిడ్ ను పరిశీలించాలని ఆ తరువాత తాము వచ్చి వివరిస్తామని కేటీఆర్,  సీఎం అఖిలేష్ తో అన్నారట.. దానికి ఆయనే సరేనని.. త్వరలోనే వస్తానని చెప్పారట..

మొత్తానికి తెలంగాణ వాటర్ గ్రిడ్ ఖ్యాతి దేశంలోనే ప్రఖ్యాతి గడిస్తోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *