
ఢిల్లీ , ప్రతినిధి : బీజేపీ వ్యవస్థాపకులు.. బహుముఖ భాషా వేత్త.. మాటల మాంత్రికుడు.. మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయికి, స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ కు నాలుగు సార్లు జాతీయాధ్యక్షుడిగా చేసిన మదన్ మోహన్ మాలవ్యకు భారతరత్న అవార్డులు ఖరారు అయ్యయి.. వాజ్ పేయికి భారతరత్న ఇవ్వాలని కేంద్రకమిటీ నిర్ణయించింది. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాజ్ పేయికి భారతరత్న ఇస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.