
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలిలో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్
ఎమ్మెల్సీ ప్రభాకర్ రాష్ర్టంలో జరుగుతున్న గొలుసు దొంగతనాల గురించి సభ దృష్టికి తేచ్చారు. అంతే కాకుండా అక్రమ ఆయుధాలు రాష్ర్టంలోకి దిగుమతి చేస్తున్నారని ఆరోపించారు. హోం మంత్రి నాయిని స్పందిస్తూ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకున్నామని అయినా దొంగతనాలు జరగడం బాధాకరమన్నారు. శాంతి భద్రతల విషయంలో విఫలమయ్యామని నిరూపిస్తే రాజీనామాలకు సిద్ధమన్నారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రాష్ర్టంలో విస్తృతంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా, పేకాట క్లబ్బులను మూసివేయించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. అనవసర విమర్శలకు దిగవద్దని హెచ్చరించారు.