
అతడి హాబీయే రెండున్నర కిలోల బంగారం దొరికేలా చేసింది. భార్య పెట్టిన చీవట్లతో బయటకు వాకింగ్ కు వెళ్లిన ఆ భర్తకు బంగారం కిలోల లెక్కన దొరికింది. ఈ అరుదైన సంఘటన ఆస్ట్రేలియాలోని కెరాంగ్ లో చోటుచేసుకుంది.
వికోర్టియాలోని కెరాంగ్ చెందిన మిక్ బ్రౌన్ కు సిగరెట్ తాగడం వ్యాపకం. భార్య కోప్పడడంతో అలా చల్లగాలికి వెళ్లిన బ్రౌన్ తన హాబీ అయిన నిధి నిక్షేపాల వెతుకులాట ప్రారంభించారు. సామాగ్రితో వెడ్డెర్ బర్న్ ప్రాంతానికి వెళ్లి పరికరంతో బ్రౌన్ అన్వేషించాడు. అంతే అప్పడే ఆయనకు భూమి లోపల 15 సెంటి మీటర్ల లోతున 2.7 కిలోల బంగారు ముద్దలు దొరికాయి. వీటి విలువ ఏకంగా లక్షా నలభై వేల డాలర్ల వరకు ఉంటుందట.. ఆ ధర కంటే ఎక్కువే చెల్లించేందుకు క్యూ కడుతున్నారట.. భార్య తిడితే బంపర్ ఆఫర్ కొట్టేసిన బ్రౌన్ నిజంగా అదృష్టవంతుడే..