
హైదరాబాద్, ప్రతినిధి : నగర శివారులో ఓ కారు బీభత్సం సృష్టించింది. మహేశ్వరం మండలం నాగారం దగ్గర వాకింగ్ చేస్తున్న వారిపైకి ఒక్కసారిగా స్విఫ్ట్ కారు దూసుకెళ్లింది. దీంతో వాకింగ్ చేస్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు నాగరాజు, శ్రీశైలం, జనార్థన్గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవరు పరారయ్యాడు.
కారులో మద్యం బాటిళ్లు కూడా లభ్యం కావడంతో మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పరారైన కారు డ్రైవరు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు మృతుల్ని పోస్టుమార్టం కోసం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.