Breaking News

వసతుల కోసం కేసీఆర్ వద్దకు బాలయ్య

balaiah

బసవతారంక క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్టు చైర్మన్ సినీ నటుడు , ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. బోకె ఇచ్చి కేసీఆర్ తో భేటి అయ్యారు. ఈ సందర్బంగా క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా రోగులకు అందుతున్న సేవలను వివరించారు. బసవతారం ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగులకు సేవా దృక్ఫథంతో సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రోగుల సౌకర్యార్థం ఆసుపత్రి ఆవరణలో పలు నిర్మాణాలను చేపట్టామని.. వాటిని బీఆర్ఎస్ కింద క్రమబద్దీకరించాలని బాలక్రిష్ణ సీఎం కేసీఆర్ ను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. సేవా దృక్పథంతో రోగులను ఆదుకుంటున్న క్యాన్సర్ ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందని హామీ ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *