వర్షాల వలన నష్టపోయిన వారిని ఆదుకుంటాం: ఈటెల

వర్షాల వలన నష్టపోయిన వారిని ఆదుకుంటాం: ఈటెల

కరీంనగర్: జిల్లాలో గత రెండు రోజులుగా కురిసిన వర్సాల వలన నష్టపోయిన బాదితులకు అన్నివిధాల ఆదుకుంటామని రాష్ట్ర్ర ఆర్ధిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలో వర్షాల వలన జరిగిన నష్టాలను పరిశీలించారు. గణేష్ నగర్, జ్యోతినగర్, సుభాష్ నగర్, తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది సెక్యులర్ ప్రభుత్వమని అన్ని మతాల వారిని సమానంగా చూస్తామని తెలిపారు. కరీంనగర్ లోని కమాన్ వద్ద వర్షాల వలన కూలిన పాత ఈద్గా గోడను పరిశీలించారు. వర్సాలు ఆగినవెంటనే పున:నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎటువంటి ఆందోళన చెందవద్దని తెలిపారు మురికి కాలువలు పొంగడం వలన, ప్రక్కన ఉన్న ఇండ్లలో నీరు వెళ్లడాన్ని పరిశీలించారు. నాళాలు శుభ్రపరిచి చెత్తచెదారం తీసి వేయాలని మంత్రి మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. వర్షాల వలన నష్టపోయిన వారికి ప్రభుత్వం సహయం చేస్తుందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, పలువురు కార్పోరేటర్లు, మున్సిపల్ కమీషనర్ కృష్ణాభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

eatela     gangula     sardar

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *