వర్షం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించిన సికింద్రాబాద్ టిడిపి నేతలు

గాలి దుమారం వర్షంవల్ల దెబ్బతిన్న ప్రాంతాలను సికింద్రాబాద్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మేకల సారంగపాణి, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలు సందర్శించారు. వర్షం వల్ల నష్టపోయిన బాధితులను తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు ఓదార్చారు. తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు .ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి మేకల సారంగపాణి మాట్లాడుతూ భారీ వర్షం వల్ల నష్టపోయిన బాధితులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు .ప్రకృతి వైపరిత్యంవల్ల సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో చాలా బస్తీలు దెబ్బతిన్నాయని,  ఇండ్లల లోకి నీరు చేరి చాలా ఆస్తి నష్టం జరిగిందని, రోడ్లు చాలా మేరకు దెబ్బతిన్నాయని వెంటనే ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని,  రోడ్ల మరమ్మత్తులకు  నిధులు మంజూరు చేయాలని సారంగపాణి డిమాండ్ చేశారు.                                                                   IMG-20180503-WA0235

About The Author

Related posts