
-దుమ్మురేపుతున్న డివిల్లీర్స్, డూప్లెసిస్
ప్రపంచకప్ సెమీస్ లో ఈరోజు జరుగుతున్న కివీస్-సౌతాఫ్రికా మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. ఆట 38 ఓవర్లున్నప్పుడు వర్షం రావడం మ్యాచ్ ను ఎంపైర్లు నిలిపివేశారు. మ్యాచ్ లో డూప్లెసిస్ (82), కెప్టెన్ డివీల్లర్స్(60) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆట మొదలైన కాసేపటికే రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను డూప్లెసిస్ 82, రోసో 39 పరుగులు చేసి ఆదుకున్నారు. అనంతరం రోసో అవుట్ కాగానే క్రీజులోకి వచ్చిన డివిల్లీర్స్ ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఆట వర్షం వల్ల అంతరాయం లో ఉన్నప్పుడు పవర్ ప్లే జరుగుతోంది. ఆటగాళ్లు దుమ్ము రేపుతున్నారు. ఆట ఆగిపోయే సమయానికి 38 ఓవర్లలో 216/3తో ఉంది.