వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉద్యమ పితమహులు ఎంసీఆర్ కు నివాళి

వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమ పితామహులు మణికొండ చలపతి రావు కు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) శనివారం నాడు నివాళులు అర్పించింది. నాటి ఉమ్మడి రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం స్థాపించిన ఏపీయూడబ్ల్యుజెకు నేటికి 62 యేండ్లు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్స్ కాలనీలో గల మణికొండ చలపతి రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఐజేయు అధ్యక్షులు దేవులపల్లి అమర్, టీయుడబ్ల్యుజె సలహాదారు కె.శ్రీనివాస్ రెడ్డి, పిసిఐ మాజీ సభ్యులు కె.అమర్ నాథ్, ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయుడబ్ల్యుజె అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, జాతీయ కార్యవర్గ సభ్యులు కె.సత్యనారాయణ, బి.ఎస్.రామకృష్ణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జూబ్లీహిల్స్ హోసింగ్ సొసైటీ అధ్యక్షుడు చారీ, ఎపియుడబ్ల్యుజె నాయకుడు అచ్యుతారావు తదితరులు పాల్గొన్నారు.

v.ali        v.ali 1      v.ali 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *