వరద సహయక చర్యలకు పోలీస్ శాఖ సిద్దం

వరద సహయక చర్యలకు జిల్లా పోలీస్ శాఖ సిద్దంగా ఉందని జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ అన్నారు. వరద ముంపునకు గురైన ప్రాంతాలకు చెందిన బాదితులు పోలీసులు సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లాలోని లోతట్టు, వివిధ ప్రాంతాల్లో వరద ముంచెత్తిన విషయం విదితమే. వర్షాల ప్రభావంతో చెరువులు, కుంటలు నిండి గండ్లు పడిన ప్రాంతాల్లో పోలీసులు సహయక చర్యలు చేపట్టారని చెప్పారు. వర్షం కురుస్తున్న సందర్భంలో నీరు నిలిచి ఉన్న రోడ్లపై ప్రయాణించక పోవడంతోపాటు శిధిలావస్ధలో ఉన్న నివాసాల్లో ఉండకూడదని తెలిపారు. మంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఉండకుండా ఎత్తెన ప్రదేశాల్లో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి లేదా పునరావాస కేంద్రాలకు తరలివెళ్ళాలని చెప్పారు. ప్రజలు ప్రమాదాలకు గురవ్వకుండా పోలీసులు రక్షణ చర్యలు తీసుకున్నారని, వాటిని గమనిస్తూ పాటించాలని సూచించారు. సమాచార, ప్రసార మాంద్యమాలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ప్రమాదం సంభవించినా, సంభవించే ప్రమాదం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు లేదా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంనకు సమాచారం అందించాలని తెలిపారు.

ఉరుములు, మెరుపుల సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
* మెరుపులతో కూడిన ఉరుముల శబ్దం వినిపించినట్లయితే ఇళ్లలోకి వెళ్ళాలి.

* ఉరుములు ఉరుముతున్నప్పుడు, ఇంటిలోకి లేదా పెద్ద భవంతిలోకి వెంటనే వెళ్ళాలి.

* అత్యవసర పరిస్దితుల్లో మినహ సెల్ ఫోన్లను వినియోగించకూడదు.

* ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు గమ్యస్ధానం చేరుకోనట్లయితే దగ్గరలో ఉన్న భవనంలోని లేదా వాహనాల్లోకి వెళ్ళాలి. * లోహంతో కూడిన పొడవైన స్తంభాలు, ఒంటరిగా ఉన్న చెట్ల కింద నిలబడకూడదు.

* ఎత్తెన ప్రదేశాల్లో ఉన్నప్పుడు పచ్చిక బయళ్ళతో కూడిన ప్రాంతంలో ఉండకూడదు. బీచ్ లలో తిరగకూడదు. పడవల్లో ప్రయాణించకూడదు.
* బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు నీటి నిల్వలు ఉండే ప్రాంతాల్లో ఉండకూడదు.

* ట్రాక్టర్లు, లోహంతో కూడిన వస్తువులకు దూరంగా ఉండాలి.

* మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, సైకిళ్ళకు దూరంగా ఉండాలి.

* ఫెన్సింగ్ వైర్లకు, బట్టలు ఆరేసే వైర్లకు లోహంతో కూడిన పైపులు, ఇతర లోహపు వస్తువులకు దూరంగా ఉండాలి.

* శిధిలావస్ధలో ఉన్న షెడ్లు, చిన్నచిన్న నిర్మాణాల్లో ఉండకూడాదు.

* బహిరంగ ప్రదేశంలో ఉన్నప్పుడు ఉరుములు, మెరుపులు వస్తాయనే సంకేతాలు ఏర్పడిన తప్పనిసరి పరిస్ధితులలో మోకాళ్ళపై కూర్చొని తలను మోకాళ్ళకు ఆన్చాలి. నేలపై పడుకోకూడదు.
* విద్యుత్ నకు సంబంధించిన యంత్ర పరికరాలు, మోటార్లను వినియోగించుకూడదు.

* రేడియో, టీవీలకు ఉన్న కనెక్షన్లను తొలగించాలి.

* ఉరుములు, మెరుపులు వచ్చి పిడుగు పడిన సవదర్భంలో 30 నిమిషాల వరకు బయటకు వెళ్ళకూడదు.

* వర్షం లేనంత మాత్రాన పిడుగు పడే అవకాశం లేదని అనుకోకూడదు. వర్షం పడుతున్న ప్రాంతం నుండి 15 కిలోమీటర్ల పరిధిలో పిడుగు పడే అవకాశం ఉంది. రబ్బర్ చెప్పులు, బూట్లు ధరించినట్లయితే పిడుగు పడే అవకాశం లేదని తప్పుడు సంకేతంతో ఉండకూడదు.

* పిడుగుపాటు గురైన వ్యక్తిని రక్షించే క్రమంలో సదరు వ్యక్తి నుండి విద్యుత్ సరఫరా అవుతుందనే అపవాదును నమ్మకూడదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *