Breaking News

వరద బాధితులపై ‘కాగ్నిజెంట్’ భారీ ఔదార్యం

Cognizant-Chennai

చైన్నై కేంద్రంగా దాదాపు 60 వేల మంది సిబ్బందితో పనిచేస్తున్న ప్రసిద్ధ అమెరికా సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ చైన్నై వరద బీభత్సాన్ని చూసి కళ్లారా చూసి చలించింది. చైన్నై కేంద్రంగా పనిచేస్తున్న కాగ్నిజెంట్ సిబ్బంది వరద లో చిక్కుకొని పనులు నిలిపివేసిన పరిస్థితి ఎదురైంది.. దాంతో పాటు చైన్నైలోని బాధితుల కష్టాలను చూసిన యాజమాన్యం భారీగా విరాళం ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకుంది.

చైన్నైని ఆదుకోవాడానికి ఏకంగా కాగ్నిజెంట్ రూ.260 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. ఇందులో 65 కోట్లను తక్షణం విడుదల చేసి సీఎం జయలలిత సహాయనిధికి అందజేసింది. మరో 195 కోట్లను శాశ్వత పునరావాస, ఇతరత్రా చర్యలకు కేటాయిస్తున్నట్లు పేర్కొంది.

తమిళనాడు సీఎం జయలలితకు వరదసాయం వెల్లువెత్తుతోంది. కార్పొరేట్ సంస్థలు, వ్యాపారవేత్తలు భారీగా విరాళాలను జయలలితకు అందజేస్తున్నారు. సీఎం సహాయనిధికి నిన్న ఒక్కరోజులోనే 22 కోట్ల సాయం వచ్చిందట.. దీంతో చైన్నై వరదబాధితులకు పునరావాస చర్యల్ని ప్రభుత్వం కల్పించనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *