
వరంగల్ ,ప్రతినిధి : వరంగల్ టూర్ లో ఉన్న సీఎం కేసీఆర్ అక్కడ పేదలు నివసించే దీన్ దయాళ్ నగర్ ను విజిట్ చేశారు. అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే దానికి సంబంధించి ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్త ఇండ్లు ఇవ్వడానికి అర్హులను గుర్తించేందుకు రేపు సర్వే చేస్తామని, అందరూ అందుబాటులో ఉండాలని కోరారు. రోడ్లు కూడా వేయిస్తామని, డ్రైనేజ్ లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.