Breaking News

వరంగల్ లో మంత్రులకు నిరసన సెగలు

00harish

వరంగల్ లో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రులకు నిరసనల సెగలు తగులుతున్నాయి. నిన్న కడియం శ్రీహరిపై చెప్పు విసిరిన ఓ రైతు.. నేడు హరీష్ రావును నిలదీశారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ప్రచారం నిర్వహించిన మంత్రి హరీష్ రావును ఓ రైతు ప్రశ్నించాడు. ‘మా చెరువులోకి గోదారి నీళ్లు ఎప్పుడు తెస్తారో చెప్పండి’ అంటూ నిలదీశాడు. మాకు కరెంట్ కూడా రావట్లేదు. రాత్రిపూట మాత్రమే ఇస్తున్నారు. చెరువులు నిండడం లేదు.. కరెంటు లేదు.. ఇదేం పాలన’? అంటూ రైతు హరీష్ ను నిలదీశాడు.

‘అడిగే హక్కు అందరికీ ఉందని.. అడగడం తప్పు కాదు?’ అంటూ హరీష్ రైతును శాంతింపచేశారు. అనంతరం రైతును పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడినుంచి పంపించేశారు. అంతకుముందు ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డిని కూడా ఓ రైతు పథకాలు అందడం లేదని విమర్శించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *