
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఓట్ల లెక్కింపులో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి పల్లా 1657 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. సమీప బీజేపీ అభ్యర్థిపై ఆయన రౌండ్ రౌండ్ కు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి ఫలితం ఎలా ఉండబోతోందని నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నేటి ఉదయం 7 గంటల వరకు తుది ఫలితం రానుంది.