వరంగల్ లో ఎన్ కౌంటర్, ఐదుగురు ఉగ్రవాదులు హతం

వరంగల్ జిల్లాలో కరుడగట్టిన ఉగ్రవాదులను పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేశారు. జిల్లాలోని జనగామ-ఆలేరు దగ్గర ఎన్ కౌంటర్ లో వికారుద్దీన్ సహా ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు.

మంగళవారం ఉదయం వికారుద్దీన్ సహా నలుగురు సిమి కార్యకర్తలు వరంగల్ జిల్లా జైలు నుంచి ఎస్కార్ట్ వాహనంలో పోలీసులు హైదరాబాద్ కోర్టుకు తరలిస్తున్నారు. వాహనం ఆలేరు దాటుతున్న సమయంలో పోలీసులపై తిరగబడి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల వద్ద ఆయుధాలు లాక్కుని జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య తీవ్రమైన పెనుగులాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పారిపోతున్న సిమి కార్యకర్తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వికారుద్దీన్ సహా ఐదుగురు సిమి కార్యకర్తలు హతమయ్యారు.

ఉగ్రవాదుల కాల్పుల్లో పలువురు పోలీసులు గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ తీవ్రవాది వికారుద్దీన్ తో పాటు సయ్యద్ అంజాద్, ఇజార్ ఖాన్, మహ్మద్ అనీఫ్, మహ్మద్ జకీర్ లు ఉన్నారు. మృతులు తెహ్రిక్ గుల్బా ఇస్లాం ఉగ్రవాద సంస్థ సభ్యులు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *