
వరంగల్ : కడియం శ్రీహరి డిప్యూటీ సీఎంగా ఎన్నికకావడంతో ఖాళీ అయిన వరంగల్ ఉప ఎన్నికకు నోటీఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. కాగా అన్నీ పార్టీల అభ్యర్థుల కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి.. వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో గెలవడానికి గట్టి అభ్యర్థులను వెతుకుతున్నాయి..
టీఆర్ఎస్ శుక్రవారం రాత్రి తమ అభ్యర్థిని ప్రకటించింది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న ఉన్నతవిద్యావంతుడు, వరంగల్ సీనియర్ నేత పసునూరి దయాకర్ ను వరంగల్ లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు.
కాగా గుడిమల్ల రవికుమార్ కు దాదాపు టికెట్ ఖరారు అనుకున్న సమయంలో కులవివాదం కారణంగా ఆయనకు సీటు గల్లంతై దయాకర్ కు కన్ పాం అయ్యింది. టికెట్ పై రాత్రి వరకు కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో కసరత్తు చేశారు.