వరంగల్ బరిలో కాంగ్రెస్ నుంచి రాజయ్య

MP-rajaiah

వరంగల్ : పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ ను చివరి వరకు వరంగల్ నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చిన అధిష్టానం చివరకు ఆయన నో చెప్పడంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన పాత అభ్యర్థి రాజయ్యకే వరంగల్ టికెట్ ను అప్పగించింది.

వరంగల్ లో పోటీకి కాంగ్రెస్ తరఫున బలమైన నాయకుడు లేకపోవడంతో రాజయ్యనే చివరకు బరిలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ. రాజయ్యను వరంగల్ లోక్ సభలోని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జీలు కూడా వ్యతిరేకించారు. కానీ అధిష్టానం చివరకు రాజయ్యకే టికెట్ ఇవ్వడం గమనార్హం.

కాగా రాజయ్య బలహీన అభ్యర్థి కావడం కూడా టీఆర్ఎస్ కు బలం చేకూర్చినట్టైంది. టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ విజయం ఇక నల్లేరుపై నడకే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *