వరంగల్ బరిలోంచి తప్పుకుంటున్న రాజయ్య.!

Primetime

వరంగల్ : వరంగల్ లోక్ సభ బరినుంచి కాంగ్రెస్ తరఫున నిలబడ్డ మాజీ ఎంపీ రాజయ్య వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఆమె కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో మనస్తాపం చెందిన రాజయ్య ఎంపీ అభ్యర్థిగా వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం.

గత కొంతకాలంగా మాజీ ఎంపీ రాజయ్య కుటుంబానికి , ఆమె కోడలు కు మధ్య తారాస్థాయిలో విభేదాలున్నాయి.. రాజయ్య ఫ్యామిలీపై 2004లో ఆమె కోడలు సారిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.తనకు వారినుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు సార్లు ఆత్మహత్యకు కూడా పాల్పడిందామె.. రాజయ్య కొడుకు, సారిక ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టాక కలతలు గొడవలు అయ్యి ప్రస్తుతం వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజయ్య కోడలు సారిక నిన్న రాత్రి అనుమానాస్పద స్థితిలో ముగ్గురు సజీవదహనం కావడంతో ఈ కేసు రాజయ్య మెడకు చుట్టుకుంది. అందుకే రాజయ్య నిలబడితే కేసులు, ఓట్లు రావని.. ఈమేజ్ డ్యామేజ్ అవుతుందని కాంగ్రెస్ రాజయ్య స్థానంలో మరొకరిని నిలబెట్టాలని యోచిస్తోంది..

వరంగల్ నుంచి కొత్తగా  కొండేటి శ్రీధర్, అద్దంకి దయాకర్, సర్వే సత్యనారాయణలను దించాలని కాంగ్రెస్ అధిష్టానానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్, భట్టి ఇతర ముఖ్య నేతలు సిఫారసు చేసినట్లు సమాచారం. ఈరోజే దీనిపై నిర్ణయించి నామినేషన్ వేయించడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.. దీంతో వరంగల్ బరిలో కొత్త ముఖం బరిలో నిలవనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *