వరంగల్ ప్రజలు దీవెనిచ్చారు..

KCR-Press-Meet

టీఆర్ఎస్ పార్టీ ప్రజల పార్టీ అని.. ప్రజలకష్టాలు నెరవేర్చేవరకు ఉద్యమిస్తుందని.. అందుకే వరంగల్ ప్రజలు దీవెననిచ్చారని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడంతో ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు..

వరంగల్ ప్రజలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నామని కేసీఆర్ అన్నారు. రైతు రుణమాపీ విషయంలో ప్రతిపక్షాలు ఆంధ్రజ్యోతి ఎన్నికల ముందు కుతంత్రాలు చేసినా ప్రజలు ఉద్యమపార్టీకే పట్టం కట్టారని కేసీఆర్ అన్నారు. తలకాయ తెగిపడ్డా తప్పు చేయనన్నారు. త్వరలోనే డీఎస్సీ ప్రకటన విడుదల చేస్తున్నామని సీఎం కేసీఆర్ నిరుద్యోగులపై వరం కురిపించారు.

పార్టీలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. రెండు నెలల్లో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్నారు. డిసెంబర్ 23 నుంచి 27 వరకు అయుత చండీయాగం నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ డబుల్ బెడ్ రూం ఇళ్లలో జర్నలిస్టులకు, పోలీసులకు, పేదలకు ఇళ్లు కేటాయిస్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *