
నల్గొండ : నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి చావు తప్పి ఎట్టకేలకు రెండో ప్రాధాన్యత ఓటు సహాయంతో విజయం సాధించారు. రెండు రోజులుగా సాగిన లెక్కింపు ప్రక్రియలో రాజేశ్వర్ రెడ్డి చివరకు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్ మోహన్ రావు(బీజేపీ)పై తొలిప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 12,723 ఓట్ల ఆధిక్యత సాధించారు. ఇంకా విజయానికి అవసరమైన 66,777 ఓట్ల మైలురాయిని చేరుకోవడానికి అవసరమైన 7013 ఓట్లు అవసరం. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల నుంచి సేకరించిన ఓట్లతో రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు.
కాగా రెండో ప్రాధాన్యత ఓటు తో గెలవడం టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ. ఎందుకంటే అధికారంలో ఉండి కనీస మెజార్టీ సాధించకుండా కూనరిల్లడం ఆ పార్టీ నైతిక ఓటమే అనుకోవాలి.. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు టీఆర్ఎస్ తో పోల్చితే .. మిగతా అన్ని పార్టీలకు బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల కు కలిపి వచ్చిన ఓట్లు 71654 ఓట్లు అంటే చతుర్ముఖ పోటీ లేకుండా అదికార టీఆర్ఎస్ తుక్కుగా ఓడేదే.. కలిసి పోటీ చేస్తే టీఆర్ఎస్ పని అయిపోయి ఉండేది.