Breaking News

వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేటలకు త్వరలో ఎన్నికలు

greater_warangal_municipal

గ్రేటర్ గెలుపుతో మరో నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అన్ని ఎన్నికల్లో గెలుపుతో టీఆర్ఎస్ లో ఫుల్ జోష్ కనపడుతోంది. మొన్న వరంగల్ ఉప ఎన్నికలు.. నిన్న అసాధ్యమనుకున్న గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుతో టీఆర్ఎస్ మరింత జోష్ తో ముందుకెళ్తోంది. ఇదే ఊపులో ప్రజల అభిమానం పొందేందుకు వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్రటెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసి మూడో వారంలో షెడ్యూల్, నోటిఫికేషన్ రిలీజ్ చేసి తొందరగా ఎన్నికలు పూర్తిచేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు దస్త్రాన్ని రూపొందించి సీఎం ఆమోదం కోసం అధికారులు పంపారు. సీఎం ఢిల్లీ నుంచి రాగానే దీనికి ఆమోద ముద్ర వేయించి ఈ నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. 12 నుంచి 15 రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నారు. మార్చి 5 లేదా 6 తేదీల్లో పోలింగ్ నిర్వహించాలని యోచిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *