వరంగల్, ఖమ్మం, అచ్చంపేటలో టీఆర్ఎస్ గెలుపు

గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు అచ్చంపల్లి నగర పంచాయతీలో టీఆర్ఎస్ విజయదుంధుబి మోగించింది. ప్రత్యర్థులు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. టీడీపీ అసలు ఖాతానే తెరవకపోవడం గమనార్హం.

వరంగల్ కార్పొరేషన్ లో మొత్తం 58 డివిజన్లలో టీఆర్ఎస్ 36 స్థానాల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 4, బీజేపీ 1, టీఆర్ఎస్ రెబల్స్, స్వతంత్రులు 9 స్థానాలు కైవసం చేసుకున్నారు.

ఖమ్మం కార్పొరేషన్ సైతం టీఆర్ఎస్ విజయదుంధుబి మోగించింది. మేయర్ పీఠాన్ని సొంతంగా చేజిక్కించుకుంది. 34 కార్పొరేటర్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ 10 స్థానాల్లో, వైసీపీ 2 స్థానాల్లో, సీపీఐ, సీపీఎం రెండేసి స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థులు ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోకపోవడం గమనార్హం.

ఇక అచ్చంపేట నగర పంచాయతీలో ఉన్న మొత్తం 20 వార్డులను టీఆర్ఎస్ కైవసం చేసుకొని మహాకూటమికి ఘోర పరాభవాన్ని మిగిల్చింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *