Breaking News

వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం

pasunurinomination

వరంగల్ : వరంగల్ లోక్ సభ కు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజార్టీ సాధించినట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. పసునూరి ధాటికి కాంగ్రెస్, బీజేపీ సహా అభ్యర్థులందరికీ డిపాజిట్లు గల్లంతు కావడం విశేషం.

టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ క్యాండిడేట్ సర్వే సత్యనారాయణపై 4,59,092 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

దయాకర్ కు 6,15,403 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సర్వేకు 1,56,311 ఓట్లు, బీజేపీ అభ్యర్థి పగిడిపల్లి దేవయ్యకు 1,30,178 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ సీపీకి అభ్యర్థికి నల్లా సూర్య ప్రకాష్ కు 23,352 ఓట్లు వచ్చాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *