
హైదరాబాద్ : ఎంపీ కడియం రాజీనామాతో ఖాళీ అయిన వరంగల్ లోక్ సభ బరిలో ఉప ఎన్నికలో ఎవరు పోటీ చేస్తారనే విషయంపై అధికార పార్టీలో అప్పుడే పోటీ నెలకొంది. వరంగల్ ఎస్పీ కేటగిరి కావడంతో ఆ వర్గం నేతలు పోటీ పడుతున్నారు.
నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా వరంగల్ చెందిన టీఆర్ఎస్ నాయకులు పసునూరి దయాకర్, ప్రొఫెసర్ సాంబయ్యలు టికెట్టు ఆశిస్తున్నారు. వీరితో పాటు ప్రైవేటు విద్యాసంస్థల అధినేత పరంజ్యోతి, డాక్టర్స్ ఐకాస నేత డాక్టర్ రమేశ్, న్యాయవాదుల ఐకాస నేత జి.రవికుమార్ లు కూడా పోటీకి సిద్దంగా ఉన్నారు.
కాగా వరంగల్ నుంచి విద్యార్థి నేత, ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవిని కూడా దింపే ఆలోచనలో ఉంది.. దీనిపై కేసీఆరే నిర్ణయిస్తారు.
కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీలు రాజయ్య, జి. వివేక్ లు బరిలో దిగే అవకాశాలున్నాయి.