
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యతలను సీఎం కేసీఆర్ మళ్లీ గెలుపు గుర్రం హరీష్ రావుకే అప్పగించారు. టీఆర్ఎస్ లో ఎన్నికలను చాలా సులువుగా.. ప్రత్యర్థి పార్టీల ఎత్తులను చిత్తు చేసే ఎత్తుగడల్లో హరీష్ రావు ఆరితేరిపోయారు . హరీష్ రావు బరిలోకి దిగాడంటే అక్కడ పార్టీ గెలుపు ఖాయమనే నమ్మకం కేసీఆర్ కు , టీఆర్ఎస్ నాయకులు ఉంటుంది..
ఈ నేపథ్యంలో నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక బాధ్యతలు హరీష్ రావు కు అప్పగించిన కేసీఆర్.. వరంగల్ ఉప ఎన్నిక బాధ్యతలను కూడా హరీష్ కే అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించారు.
ఇప్పటికే బీజేపీ, టీడీపీ లు కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడుతున్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి కూడా ఎంపీ వివేక్ , రాజయ్య, సర్వే పోటీపడుతున్నారు. దీంతో ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకం అయ్యింది. దీంతో టీఆర్ఎస్ బలమైన అభ్యర్థి కోసం సర్వే చేపట్టింది..
టీఆర్ఎస్ తరపున వరంగల్ నుంచి సీనియర్ నాయకులు పసునూరి దయాకర్, గుడిమల్ల రవికుమార్, ప్రొఫెసర్ సాంబయ్య, డాక్టర్ రమేశ్, ఎర్రొల్ల శ్రీనివాస్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరికి కేసీఆర్ టీఆర్ఎస్ టిక్కెట్ ఇస్తారని సమాచారం.