
వరంగల్ (పిఎఫ్ ప్రతినిధి): వరంగల్ ఉపఎన్నికల బరిలోకి దించిన పసునూరి దయాకర్ ను ఎలాగైనా గెలిపించుకోవాలని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సీఎం కెసిఆర్ తెలిపారు. వరంగల్ ఉపఎన్నికల టిఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికలో ఎటువంటి సమస్య లేకుండా ఎన్నుకునేందుకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అభ్యర్థి ఎవరైనా అందరూ కలిసి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ర్టంలో కరెంటు కష్టాలు లేకుండా చేశామని అన్నారు. ఇన్నాళ్లుగా తెలంగాణ ప్రజలు అనుభవించి కరెంటు బాధలు వర్ణణాతీమని అన్నారు. అంతే కాకుండా ఈ ఏడాదిలోగా పేదలకు 60 వేల ఇండ్లు కట్టించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అంతే కాకుండా వచ్చే ఏడాది నుంచి కళ్యాణలక్ష్మీ పథకం బిసిలకు వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. టిఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన మొత్తం ఖర్చు పార్టీయే భరిస్తుందని అంతేకాకుండా సర్వేల ప్రకారం టిఆర్ఎస్ పార్టే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దయాకర్ కు ఏ ఫాం, బి పాం అందజేశారు.